నేడు మంత్రి పర్యటన
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేడు(మంగళవారం) కాటారం, మహదేవపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించనున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
బాలికల భద్రత కోసం కృషి
రేగొండ: బాలికల భద్రత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జస్ట్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ జిల్లా కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం మండలంలోని లింగాల క్రాస్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలిక భద్రంగా ఉన్నప్పుడే భావితరాల మనుగడ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయులు, రేగొండ మొబ్‌లైజర్స్ బల్గూరి వెన్నెల, సామల శ్రీలత, అశోక్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి
విద్యార్థుల ఎంపిక
మొగుళ్లపల్లి: సీఎం క్రీడల్లో మండలంలోని మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఉడుత రోహిత్, అప్పం విద్యాకర్, ఎండీ ఫయాజ్, గజనవేని హర్షిత్, గుడిమల్ల శివచరణ్, గండు వైష్ణవి, దివ్య, శ్రీనిధి ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బినామీ పట్టాలను
రద్దుచేయాలి
పలిమెల: బినామీ పట్టాలను రద్దు చేసి నిరుపేదలకు భూ పట్టాలు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారెపెల్లి మల్లేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలిమెల మండల కేంద్రంతో పాటు, మండలంలోని బోడాయిగూడెం, సర్వాయిపేట గ్రామాల్లోని నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను కొంత మంది అక్రమంగా పట్టాలు చేసుకుని దక్కన్ సిమెంట్ సంస్థకు 110 ఎకరాల భూమిని విక్రయించారని మండిపడ్డారు. 100 సంవత్సరాలుగా నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిరుపేదలు సాగుచేసుకుంటున్న భూములను రైతులకే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాబుయాదవ్, నోషయ్య, కిరణ్, వెంకటేష్, శ్రీనివాస్, మదునయ్య, లచ్చయ్య, గందం శంకర్ ఉన్నారు.
భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. టూరిజం గైడ్ ఆలయ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. రామప్ప ఆలయంలో పలు చోట్ల విద్యార్థులు గ్రూప్ ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment