రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉత్పత్తిలో భూపాలపల్లి గనులు ముందువరుసలో ఉన్నాయని, ఉత్పత్తి వంద శాతం సాధిస్తామని చెప్పారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను సోమవారం భూపాలపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జీఎం కార్యాలయంలో సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్‌చేశారు. అనంతరం అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ వేడుకలను ప్రారంభించి జీఎం మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఉత్పత్తిలో భూపాలపల్లిని నంబర్‌వన్‌గా నిలుపాలని ఆకాంక్షించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు ఉద్యోగుల సంక్షేమంలో సంస్థ రాజీలేకుండా ముందుకు సాగుతుందన్నారు. సంస్థ మనుగడతో పాటు సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ఉత్పత్తి లక్ష్యానికి చేరువలో..
భూపాలపల్లి ఏరియాలో ఇప్పటివరకు 30.64లక్షల టన్నుల లక్ష్యానికి గాను 22.60లక్షల టన్నులు (74శాతం) ఉత్పత్తి సాధించామని జీఎం తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగిందన్నారు. భూపాలపల్లికి వందల సంవత్సరాల ఉజ్వల భవిష్యత్ ఉందని సమష్టిగా సమన్వయంతో కృషి చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు.
సిరులు కలిగిన సింగరేణి
సిరులు కలిగిన సింగరేణిని ప్రతీ ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి స్టేడియంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ప్రారంభించి రక్షణ పరికరాలను పరిశీలించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే రక్షణ చర్యలను మాక్‌డ్రిల్ ద్వారా రెస్క్యూ టీం చూపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల అభివృద్ధికి సంస్థ పాటుపడుతుందన్నారు. భూపాలపల్లిలో ఓసీల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందని రైతులకు అందేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సింగరేణి ప్రభావిత గ్రామాల యువతకు ఉపాధి కల్పించే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించాలని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పారు.
భూపాలపల్లి ఏరియా జీఎం
రాజేశ్వర్‌రెడ్డి
అంబరాన్నంటిన
సింగరేణి ఆవిర్భావ వేడుకలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం కవీంద్ర, పర్సనల్ మేనేజర్ మారుతి, అధికారి వెంకటరామిరెడ్డి, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ మధుకర్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment