ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి
భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి ప్రజలు అందజేసిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రజావాణిలో 32 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఆ సమాచారం ప్రజావాణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ మంగీలాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment