వాజేడు: జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో సోమవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పేద ప్రజల ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అవగాహన కల్పించి వారికి జరిగే నష్టం విలువను ముందుగానే తెలిపి పరిహారాన్ని వెంటనే ఇచ్చేలా చూడాలన్నారు. సర్వే సమయంలో కొంత పోతుందని తెలిపి ప్రస్తుతం ఎక్కువ భాగం పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు పెసా గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. రఘుపతి, దేవయ్య, కృష్ణ బాబు, సౌమ్య ఉన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ
Comments
Please login to add a commentAdd a comment