ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించి హక్కులను, డిమాండ్‌లను సాధించుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పక్కన ఉన్న ప్రధాన రోడ్డుపై ఉమ్మడి వరంగల్, కరీనంగర్ జిల్లాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు నిరవదిక సమ్మెను చేపట్టగా కృష్ణప్రసాద్ హాజరై మాట్లాడారు. సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొదెం రవీందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 2003 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ వ్యవస్థ ప్రారంభమైన ఇప్పటి వరకు చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పొదెం కృష్ణ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment