క్రీడల్లో గెలుపోటములు సహజం
గణపురం: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహం చెందకుండా గెలుపొందే వరకు పోరాడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని సీతరాంపురం గ్రామంలో వన్ స్టార్ వన్ యూనియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మ డి జిల్లా స్థాయి షటిల్ ప్రిమియర్ లీగ్ సీజ్–2 టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతుల ప్రదా నం చేశారు. విన్నర్ టీంకు 10వేల రూపాయల చెక్కుతో పాటు బహుమతి, రన్నర్ టీంకు రూ.5 వేల చెక్కుతో పాటు బహుమతిని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు క్రీడాకారులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి..
భూపాలపల్లి రూరల్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వర కు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, నాయకులు దేవన్, బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు పాటించాలి
క్రీస్తు బోధనలు పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మైనార్టీ శాఖ అధ్వర్యంలో సోమవారం మంజూరు నగర్ కల్వరీ చర్చిలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణ రావు అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ శాఖ అ ధికారిణి శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, కోఆప్షన్ మెంబర్ నేరుపట్ల కమల, ప్రజా ప్రతినిధులు బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, కప్పల రా జేష్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కర్ణాకర్, పాస్లర్టు, రాజ్‌కుమార్, రాజవీరు, డెవిడ్‌రాజ్, మనో హర్, జాన్ రమేష్, ధామస్, సంపత్‌రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment