కొత్త జీపీల ఏర్పాటుకు కసరత్తు
మల్హర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరణంలో మండలంలో మరో రెండు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జీపీల వివరాలు, వాటి పేర్లు, విస్తీర్ణం, వార్డుల సంఖ్య, జనాభా సంఖ్య తదితర వివరాలతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్త జీపీల ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మండలంలో మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బగట్టు, రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రుద్రారం గ్రామం కొత్త జీపీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జిల్లా అధికారుల వద్దకు వెళ్లాయి.
రెండు జీపీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మండలంలో మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బగట్టు (రావులపల్లి), రుద్రారం గ్రామ పంచాయతీలోని పాత రుద్రారం గ్రామాలను పునర్విభజన చేసి కొత్త జీపీలు ఏర్పాటు చేయనున్నారు. దబ్బగట్టులో 444 జనాభా, 07 వార్డులు, మల్లారం జీపీ నుంచి దబ్బగట్టుకు ఉన్న దూరం 1.5 కిలోమీటర్లుతో ఉన్న గ్రామం పరిధిలోని సర్వే నంబర్లతో కూడిన నివేదికతో జీపీ ఏర్పాటుకు అధికారులు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. అలాగే రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రుద్రారం గ్రామ పంచాయతీ ఏర్పాటుకు 07 వార్టులు, 340 జనాభా, రుద్రారం నుంచి పాత రుద్రాతాన్ని దూరం 8.2 కిలోమీటర్లు విస్తీర్ణంతో నివేదకను సమర్పించారు. ప్రస్తుతం ఉమ్మడి మల్లారం గ్రామ పంచాయతీలో 2574 జనాభా, ఉమ్మడి రుద్రారంలో 3070 మంది జనాభా ఉన్నారు. మండలంలో ఇప్పటికి 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం మరో రెండు జీపీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గెజిట్ వెలువడితే 17 గ్రామ పంచాయతీలు కానున్నాయి.
పెరుగనున్న మరో రెండు పంచాయతీలు?
దబ్బగట్ట, పాత రుద్రారం ఏర్పాటుకు ప్రతిపాదనలు
ప్రతిపాదనలు పంపించాం..
మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బగట్టు, రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రుద్రారం గ్రామాలు నూతన జీపీల ఏర్పాటుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. తదుపరి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.
– శ్యామ్‌సుందర్, ఎంపీడీఓ, మల్హర్
ఎన్నికల నిర్వహణకు కసరత్తు
పంచాయతీ పాలకవర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగతోంది. కొత్త సర్పంచ్‌ల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మాస్టర్ ట్రైనర్లు, ఎంపీఓ, పంచాయతీ కార్యాదర్శులకు ఎన్నికల విధి విధానాలు, ఓటరు జాబితాల రూపకల్పన, వార్డుల విభజన తదితర ఆంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో ఓటరు తుది జాబితాను ప్రదర్శించారు. కొత్త జీపీల ఏర్పాటుకు గెజిట్ విడుదలైతే వాటికి సైతం ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది ప్రభుత్వం తీసుకోని నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment