పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టేకుమట్ల: కేంద్ర ప్రభుత్వ పథకాలను బూత్‌స్థాయి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దుగ్యాల రాంచందర్‌రావు అన్నా రు. సోమవారం మండలంలోని అంకుషాపూర్‌లో బూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రానున్న స్థానిక సంస్తల ఎన్నికల్లో సత్తా చాటాలని, 2027ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం బూత్ కమిటీ వివరాలను వెల్లడించారు. అధ్యక్షుడిగా సాద సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా దానవేని చిన్నకుమార్ ఉపాధ్యక్షులుగా పోతనవేని స్వామి, కార్యదర్శిగా చిలుక ప్రణీత్, కోశాధికారిగా రమేష్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదరి, గుర్రపు నాగరాజు, సోషల్ మీడియా బూత్ అధ్యక్షులు అబ్బెంగుల హరీష్, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్ నాంసాని రమేశ్ పాల్గొన్నారు.
చిట్యాల: బూత్ కమిటీలతోనే భారతీయ జనతా పార్టీ పటిష్టమవుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేశ్ అన్నారు. సోమవారం మండలంలోని నవాబుపేట, చింతకుంటరామయ్యపల్లి, కై లాపూర్ గ్రామాలలో బూత్ కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు బిల్ల సత్యనారాయణ రెడ్డి, రాయిని శ్రీనివాస్, మందల రాఘవ రెడ్డి, మాదారాపు రాజు, కత్తుల ఐలయ్య, చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్యాల రాంచందర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment