చెక్కుల పంపిణీ
చిట్యాల: మండల కేంద్రానికి చెందిన మాదాసు దేవేందర్, అల్లం సునీతలకు మంజూరైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొకిరాల మధువంశీక్రిష్ణ సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఆస్పత్రి చికిత్స పొంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు చిలుకల రాయకొమురు, గంగాదర్ రవీందర్, గుర్రపు తిరుపతి, ఉయ్యాల రమేశ్, గుర్రపు నర్సయ్య, తదితరులు ఉన్నారు.
కొయ్యూరు గ్రామ సందర్శన
మల్హర్: మండలంలోని కొయ్యూరు గ్రామాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రా జయ్య సోమవారం సందర్శంచారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన సమస్యలను మండల కమిటీ అధ్యక్షుడు వేల్పుల మహేందర్, ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తి ప్పల రజిత రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారా నికి సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment