రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన
ములుగు: ఇన్నాళ్లు క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఉన్నతికోసం పనిచేసి తమకు కష్టం వచ్చిందంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదని ఆదుకుంటారా.. రోడ్డున పడేస్తారా ప్రభుత్వానికే వదిలేస్తున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ ఆవరణలో చేపడుతున్న దీక్ష సోమవారంతో 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి భోజనం చేసి సూత్రపాయంగా తమ బతుకులు రోడ్డుపై పడ్డాయని ప్రభుత్వానికి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆదిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్ పాడ్య, ఉపాధ్యక్షుడు ఫిరోజ్, కార్యవర్గ సభ్యులు సుజాత, రమేష్, సమన్వయకర్తలు రాజేశ్వరీ, జయ, వసంత, వెంకటలక్ష్మీ, శిరీష, సుజాత, అరుణ, భాగ్యలక్ష్మీ, ప్రవీణ్, నాలంబాయి, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment