రైతులను గౌరవించడం బాధ్యత
కాటారం: ఎంతో శ్రమనోడ్చి పంట పండించి అన్నం పెట్టే రైతన్నను గౌరవించడం ప్రతి ఒక్కరీ బాధ్యతగా భావించాలని ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్‌రావు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్‌లో సోమవారం జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని రైతులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయంపై అవగాహన కల్పించి పనిముట్ల వియోగం, ఎదుర్కొనే సమస్యలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆదర్శ అగ్రి ఎక్స్‌పో ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. రైతులకు అవసరమయ్యే ఆధునిక పనిముట్లు, వినూత్న పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో ఏఐ ఇంటిగ్రేషన్‌ను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జనగామ కార్తీక్‌రావు, ప్రిన్సిపాల్ కృషిత, రైతులు కొట్టె శ్రీహరి, శేఖర్, జనార్ధన్, చీమల మల్లయ్య, వెంకట్రాజం, తోట బాపు, డొంగిరి రాజయ్య, గట్టయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment