మంత్రికి తెలియకుండానే ఫ్యాక్టరీ వస్తుందా?
కాళేశ్వరం: మంత్రి శ్రీధర్‌బాబుకు తెలియకుండానే పలిమెలకు సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా వస్తుందని బీఆర్‌ఎస్ మంథని నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జ్ కేదారి గీత ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి సోదరునికి దక్కన్ సిమెంట్ కంపెనీలో వాటాల కోసం దళిత, గిరిజన భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దళిత, గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన అనుచరులతో దక్కన్ సిమెంట్ కంపెనీ పేరుమీద చేయించిన అక్రమ పట్టాలను రద్దు చేసి అందులో తరతరాలుగా సాగుచేసుకుంటున్న నిజమైన అర్హులైన దళిత, గిరిజన రైతుల పేరిట మార్పు చేయాలని డిమాండ్ చేశారు. మహదేవపూర్ మహిళా అధ్యక్షురాలు చిలుక సునీత, ఎలకేశ్వరం మహిళా అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ
మహిళా ఇన్‌చార్జ్ గీత
Comments
Please login to add a commentAdd a comment