ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మొదటి రోజు నిర్వహించిన స్ఫూర్తితోనే ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం మొదటిరోజు గ్రామసభల నిర్వహణ, తదుపరి తేదీల్లో గ్రామసభల నిర్వహణ తదితర అంశాలపై మండల, గ్రామ పంచాయతీ, ప్రత్యేక అధికారులు, వ్యవసాయ, మున్సిపల్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటిరోజు 72 గ్రామసభలు విజయవంతం కావడం పట్ల అధికారులను, ప్రజలను కలెక్టర్ అభినందించారు. మిగిలిన మూడు రోజులు ఇదే స్ఫూర్తితో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామసభలు షెడ్యూల్ ప్రకారం పక్కాగా నిర్వహించాలని చెప్పారు. గ్రామసభల నిర్వహణ ద్వారా అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. గ్రామసభలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, మండల, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, వ్యవసాయ అధికారి విజయభాస్కర్, డీఆర్‌డీఓ నరేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
రేగొండ: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్‌శర్మ స్పష్టం చేశారు. మండలంలోని రామన్నగూడెం తండాలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారితో పాటు అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సాగు భూములకు పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరగా.. పట్టాలు సీసీ పెండింగ్‌లో ఉన్నాయని అవి క్లియర్ అయిన వెంటనే లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి వాసుదేవారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
వీడియో కాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్‌లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment