దరఖాస్తులకు ఆమోదం, తిరస్కరణలు
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా మొదటి రోజు మంగళవారం 72 గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. నాలుగు ప్రభుత్వ పథకాలకు గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో రైతు భరోసా పథకానికి 1,086మంది రైతుల దరఖాస్తులకు గాను 534 ఎకరాలకు 1,011మంది రైతులకు గ్రామసభ ఆమోదం తెలిపింది. నూతనంగా మరో 92మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 2,386 దరఖాస్తులు రాగా 2,055 దరఖాస్తులను గ్రామసభ ఆమోదించగా నూతనంగా మరో 1,206మంది దరఖాస్తు చేసుకున్నారు. నూతన రేషన్‌కార్డులు 2,067 ధరఖాస్తులకు 1,728 ఆమోదం కాగా నూతనంగా 3,408 దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11,832 దరఖాస్తులు రాగా 11,447 అమోదం తెలిపారు. నూతనంగా 2201 మంది నుంచి దరఖాస్తుల స్వీకరించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment