కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారంలోని ఊరచెరువును ఇరిగేషన్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈఈ యాదగిరితో ఇరిగేషన్ అధికారులు చిన్న కాళేశ్వరం ద్వారా నీటిని నింపే ప్రక్రియపై పరిశీలన చేశారు. చిన్న కాళేశ్వరం కెనాల్ వెంట కలుస్తున్న చెరువులపై ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించారు.
జిల్లాస్థాయి పోటీలు
భూపాలపల్లి అర్బన్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్, వకృత్వ పోటీలను నిర్వహించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలశౌరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రావణి (పెద్దాపూర్) హితోక్తి (మొగుళ్లపళ్లి), హరిని (భూపాలపల్లి), హర్షవర్థని (సింగరేణి కాలరీస్ స్కూల్), పవన్‌కుమార్ (భూపాలపల్లి), అస్విత (మహదేవపూర్), అక్షయ (ఘనపూర్), హిందుశ్రీ (భూపాలపల్లి) ఈ నెల 31న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, కాంప్లెక్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయులు గిరిధర్, వీరన్న, నవనీత్, రమేష్, తిరుపతి, నాగభవాని, రాజు, నీలిమ, అమలారెడ్డి, బాలరాజు, సతీష్ హాజరయ్యారు.
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో టీజీఎంఎస్‌ఐడీసీ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్లకు ఈ ఔషధిపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఎం మాట్లాడుతూ.. వార్షిక అవసరాల కోసం పెట్టే మందులు ఇండెంట్లు పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ ఔషధి అమలులో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ అధికారులు సమన్వయంగా అవసరానికి తగినట్టు వార్షిక ఇండెంట్లు పెట్టాలన్నారు. మందులు ఎక్స్‌పైరీ కాకుండా అవసరం ఉన్న ఆస్పత్రులకు ఈ ఔషధి ద్వారా పంపించి సకాలంలో మందులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీచింగ్ ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు వివిధ రకాల మందులు సరఫరా చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధి కారి డాక్టర్ ఉమాదేవి, ఉమ్మడి జిల్లాల సెంట్రల్ మెడిసన్ స్టోర్ ఇన్‌చార్జ్ ఉప్ప భాస్కర్‌రావు, సిబ్బంది పద్మజ, మధుబాబు, రజినికాంత్, క్రాంతికుమార్, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఏఓకు వినతి
భూపాలపల్లి రూరల్: ధర్మసమాజ్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పార్టీ నాయకులు కలెక్టరేట్ ఏఓ ఖాజా మోహనీద్దున్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ 26న జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్, గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామి నాథన్, భూపాలపల్లి మండల నాయకులు మోకిడి అశోక్,బోయిని ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment