సనాతన ధర్మ పరిరక్షణకు కృషి
సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడానికి కృషి చేయాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి అన్నారు.
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ చలితో పాటు మంచు కురుస్తుంది.
– 8లోu
గ్రామాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు అడ్డగోలు ధరకు పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని దళారులు గతంలో సమీపంలోని జిన్నింగ్ మిల్లులు, వరంగల్, ఇతర పట్టణాల్లోని కాటన్ ఇండస్ట్రీస్‌కు పంపించేవారు. కానీ దళారులు ప్రస్తుతం తమ పంథా మార్చుకున్నారు. స్థానిక పత్తి మిల్లుల యాజమాన్యం సహకారంతో రైతుల దగ్గర కొనుగోలు చేసిన పత్తిని నేరుగా సీపీఐ ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడానికి ముందస్తుగానే దళారులు సదరు సీసీఐ కేంద్రాల నిర్వాహకులతో మామూళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.200 వరకు సీసీఐ కేంద్రాల నిర్వాహకులు దళారుల వద్ద నుంచి కమీషన్‌గా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్తి కాంటా పూర్తికాగానే సదరు కమీషన్ నగదు మొత్తం దళారులు లెక్కచేసి సీసీఐ కేంద్రాల నిర్వాహకులకు ముట్టజెపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సీసీఐ నిర్వాహకులు దళారులు విక్రయానికి తీసుకొచ్చిన పత్తి ఏ రకంగా ఉన్నా మద్దతు ధర అందజేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
దళారులు టు సీసీఐ..
Comments
Please login to add a commentAdd a comment