ఉత్సాహంగా రాక్‌క్లైంబింగ్
రేగొండ: రేగొండ మండలంలోని చారిత్రక ప్రాంతమైన పాండవుల గుట్టలో ఎకో టూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు నిర్వహించిన రాక్ క్లైంబింగ్, రాప్పెల్లింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పాండవుల గుట్టలోని ప్రత్యేకాకర్షణగా నిలిచిన తొండం గుండు వద్దకు చేరుకుని అక్కడి శిలాకృతులకు ముగ్ధులై తమ కెమెరాల్లో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ నరేష్, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి, ఎఫ్‌బీఓ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ శని, ఆదివారాల్లో పాండవుల గుట్టలో పర్యాటకుల కోసం రాక్‌క్లైంబింగ్‌తో పాటు రాప్పెల్లింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. రాక్‌క్లైంబింగ్‌లో పాల్గొనే పర్యాటకులు 94415 55524 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. వారివెంట రాక్‌క్లైంబింగ్ ఇన్‌స్ట్రక్టర్లు అల్లె భాస్కర్, శ్రీకాంత్, రవిందర్, భరత్‌రాజ్, భాస్కర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment