కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్‌ దేశస్తుడు | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్‌ దేశస్తుడు

Published Fri, Jan 31 2025 2:09 AM | Last Updated on Fri, Jan 31 2025 2:09 AM

కోటగు

కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్‌ దేశస్తుడు

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను బ్రిటన్‌ దేశానికి చెందిన రోజ్‌ మెల్విన్‌ గురువారం సందర్శించారు. ఆయన కాకతీయుల ఆలయాలపై పరిశోధన చేస్తూ హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, ఫోర్ట్‌ వరంగల్‌, రామప్ప ఆలయాలను సందర్శిస్తూ గణపురం కోటగుళ్లను సందర్శించి వాటి చరిత్రను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ అసిస్టెంట్‌ ప్రమోషన్‌ అధికారి డాక్టర్‌ కుసుమ సూర్యకిరణ్‌, పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మల్లు నాయక్‌ ఉన్నారు.

నాపాక ఆలయం సందర్శన

చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలోని నాపాక సర్వతోభద్ర ఆలయాన్ని రోజ్‌మెల్విన్‌ సందర్శించాడు. ఆలయం విశిష్టతను వరంగల్‌ జిల్లా అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సూర్య కిరణ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్‌ దేశస్తుడు1
1/1

కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్‌ దేశస్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement