మున్సిపల్ కమిషనర్‌గా బిర్రు శ్రీనివాస్
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా బిర్రు శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన కమిషనర్ టి.రాజేశ్వర్ వరంగల్ నగర పాలక సంస్థకు బదిలీపై వెళ్లగా, రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్‌ను భూపాలపల్లికి బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మున్సిపాలిటీ స్పెషలాఫీసర్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మిని ఐడీఓసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్
భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్‌ను సంప్రదించాలని భూపాలపల్లి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 1912 నంబర్‌లో 24/7 వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా, ఆగిపోయిన మీటర్లు, నూతన సర్వీసు మంజూరు, మొదలగు అన్ని రకాల విద్యుత్ సమస్యల కోసం సంప్రదించవచ్చని చెప్పారు.
జాతిపితకు ఘన నివాళి
భూపాలపల్లి అర్బన్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మురళీ, శైలేంద్రకుమార్, ప్రదీప్, మారుతి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హత్య కేసులో
మరొకరి అరెస్ట్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26వ తేదీన భర్తకు పురుగుల మందు కలిపి భోజనం తినిపించి హత్య చేసిన కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన కందుల సురేష్‌ను అతని భార్య స్వప్న హత్యచేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్‌కాలనీకి చెందిన కుంట్ల స్వామి మృతుడి భార్య స్వప్నకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం సురేష్‌ను హత్య చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కుంట్ల స్వామిని పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment