సర్వే సక్రమంగా చేయలేదు..
ప్రజాపాలన దరఖాస్తుల విచారణ, కుల గణన సర్వే సక్రమంగా చేయలేదు. నాకు పెళ్లి అయి 11 ఏళ్లు అయింది. దరఖాస్తులు అడిగినప్పుడల్లా ఇచ్చిన. ఇప్పటివరకు నాకు రేషన్‌కార్డు రాలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. ఏ ప్రభుత్వ పథకం కూడా నాకు రాలేదు. అధికారులు మరోమారు సర్వేచేసి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి.
– అంబాల సాంబయ్య, చిట్యాల
ఎన్నిసార్లు
దరఖాస్తు చేసుకోవాలి..
మా పెద్ద పాప పేరును రేషన్‌కార్డులో నమోదు చేసేందుకు 9 ఏళ్ల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా. ఇటీవల కుల గణన సర్వేలో కూడా పూర్తి వివరాలు చెప్పిన. అయినా ఇప్పుడు రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల జాబితా రాలేదు. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకొమ్మని చెబుతున్నారు. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం రేషన్‌కార్డు అడిగినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది.
– గంధం సురేష్, వెలిశాల, టేకుమట్ల
కొత్త రేషన్‌కార్డు ఇస్తలేరు..
నాకు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. మా అమ్మ, నాన్నలతో వేరుపడగానే ఆ రేషన్‌కార్డులో నుంచి నా పేరును తొలగించారు. దీంతో చేసేది లేక నా, నా భార్య పేరు మీద రెండుసార్లు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. కానీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. పేరును తొలగించిన అధికారులు కొత్త కార్డును మాత్రం మంజూరు చేయడం లేదు. దీంతో కనీసం ఆరోగ్య శ్రీ పథకానికి కూడా అర్హుడిని కాకుండాపోయాను.
– బానోత్ రాజ్‌కుమార్,
అడ్వాలపల్లి, మల్హర్
●
Comments
Please login to add a commentAdd a comment