భయంగానే బడికి.. | - | Sakshi
Sakshi News home page

భయంగానే బడికి..

Published Sat, Nov 23 2024 1:11 AM | Last Updated on Sat, Nov 23 2024 1:11 AM

-

నారాయణపేట/మక్తల్‌/మాగనూర్‌: మాగనూర్‌లో జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనతో భయంగానే విద్యార్థులు రెండు రోజులుగా బడికి చేరుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం తినాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అడిషనల్‌ కలెక్టర్‌ బేన్‌ షాలం పాఠశాలకు చేరుకొని కొత్తగా తెప్పించిన బియ్యాన్ని పరిశీలించారు. వారితోపాటు జిల్లా అధికారి యాదయ్య, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమ, తహసీల్దార్‌ సురేశ్‌, ఎంపీడీఓ రహమతుల్లా దగ్గరుండి భోజన ఏర్పాటు పరిశీలించారు. ఎమ్మెల్యే, అడిషనల్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు వి ద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఇదిలాఉండగా, విద్యార్థుల అస్వస్థత ఘటనతో విద్యా ర్థుల హాజరుశాతం తగ్గింది. 578 మంది ఉండగా బుధవారం 455 మంది, గురువారం 229, శుక్రవారం 338 మంది పాఠశాలకు వచ్చారు. అలాగే, చాలామంది విద్యార్థులు తమ ఇళ్ల నుంచి భోజనాన్ని టిఫిన్లలో తెచ్చుకొని తింటు కానవచ్చారు.

అప్పుడే తొలగించించాల్సింది..

మధ్యాహ్న భోజన నిర్వాహకుల గతంలో తప్పిదం చేసిన వెంటనే వారిని తొలగించి ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉపాధ్యాయులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు ఉండాలన్నారు. తొలగించిన ఏజెన్సీ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌

విద్యార్థుల పరిస్థితి

ఎమ్మెల్యే, అడిషనల్‌ కలెక్టర్‌ పాఠశాలసందర్శన.. విద్యార్థులతో కలిసి భోజనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement