విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
గట్టు: నిజాయితీగా మనం సాధించుకున్న మార్కులు మన విలువను పెంచుతాయని, విద్యార్థులు క్రమశిక్షణతో ప్రణాళికా బద్దంగా చదువుకుని మంచి మార్కులను సంపాదించుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజు అన్నారు. శుక్రవారం గట్టులోని కస్తూర్భా పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. విద్యార్థులు నిజాయితీగా పరీక్షలు రాస్తూ, మంచి మార్కులను సంపాదించుకోవాలని అన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో విద్యార్థినులకు వివరించారు. ఇంటర్ అనేది విద్యార్థి దశలో కీలకమని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పచుకుని, దాన్ని సాదించే దిశగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గుంటి గోపిలత, మహిళా ఉపాధ్యాయులు గీతాంజలి, జ్యోతి, పుప్పావతి, కవితా, రాణి, రమ్యశ్రీ,శ్యామలమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment