జమ్ములమ్మ వేలం పాటలో కాంట్రాక్టర్ల సిండికేట్
గద్వాలటౌన్ : 2024–25 జమ్ములమ్మ ఉత్సవాలకు సంబంధించిన వివిధ వేలం పాటల వ్యవహారం సిండికేట్‌గా మారింది. గతేడాది కంటే కొంత ఎక్కువ ధరకు పాట పాడి వేలాన్ని పొందాలకున్న కాంట్రాక్టర్ల వ్యూహం ఫలించింది. కాంట్రాక్టర్ల రింగ్ యత్నాలు సాఫీగా సాగాయి. గురువారం జమ్ములమ్మ ఆలయ కార్యాలయంలో అఽధికారులు వెంకటేశ్వరి, పురందర్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది టెంకాయలు, కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలకు సంబంధించిన బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలం పాటకు ముందు కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదర్చటానికి కొంత మంది పెద్దలు ప్రయత్నించారు. అందుబాటులోని అన్ని మార్గాలను అనుసరించారు. కార్యాలయ ఆవరణలోనే సుమారు గంటపాటు వేలంపాట కోసం తీవ్రంగా మంతనాలు జరిపారు. గత సంవత్సరం కంటే కొంత ఎక్కువగా పాట పాడి టెంకాయల వేలం సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట గుడ్‌విల్ విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం మరోసారి గుడ్‌విల్ విషయంపై కాంట్రాక్టర్లు మంతనాలు సాగించి మొత్తానికి ఏకాభిప్రాయం కుదిరింది. వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్ పోటీలో పాల్గొన్న మిగతా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి రూ.1.10లక్షలు గుడ్‌విల్ ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగినట్లు తెలిసింది. తెరవెనక ఉండి రింగ్ యత్నాలు నడిపించిన నాయకులకు అదనంగా మరో రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రింగ్ యత్నాలు ఫలించిన తర్వాత కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొన్నారు.
రూ.50.04 లక్షలకు టెంకాయల వేలం ఖరారు
Comments
Please login to add a commentAdd a comment