అధికారులకు ఎవరికి అనుమానం రాకుండా కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా టెంకాయల వేలం పాట పాడారు. గతేడాది కంటే 10శాతం అధికంగా టంకాయల వేలాన్ని పాడారు. మొత్తం 7 మంది కాంట్రాక్టర్లు వేలం పాటలో పాల్గొన్నారు. టెంకాయల వేలం గత ఏడాది రూ. 44.35 లక్షలకు దక్కించుకోగా.. ప్రస్తుతం రూ.50.04 లక్షలకు పులిపాటి నగేష్ అనే కాంట్రాక్టర్ పాట పాడి టెంకాయల వేలం సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం మొత్తంలో కంటే పది శాతం అధికంగా ఉండటంతో టెంకాయల వేలం ఆమోదానికి అధికారులు మొగ్గు చూపారు. కొబ్బరి చిప్పల వేలం గతేడాది రూ. 11.67 లక్షలకు దక్కించుకోగా.. ప్రస్తుతానికి వచ్చే సరికి రూ.12.22 లక్షలకు ఓంప్రకాష్ కాంళ్లే అనే కాంట్రాక్టర్ సొంతం చేసుకున్నారు. ఇందులో రూ.50 వేలు గుడ్‌విల్ రూపంలో చేతులు మారినట్లు తెలిసింది. మొదటిసారి నిర్వహించిన అమ్మవారి చీరల వేలం పాటను కాంట్రాక్టర్ రూ. 3.54లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల వేళాలు వాయిదా పడ్డాయి. అధికార పార్టీలోని రెండు వర్గాలకు చెందిన నాయకులే వేలంపాటలో పాల్గొని సిండికేట్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment