రెగ్యులర్ మెస్‌ను ప్రారంభించాలి
గద్వాల: జిల్లా కేంద్రంలో నది అగ్రహరంలోని ప్రభుత్వ పీజీ సెంటర్లో రెగ్యులర్ మెస్‌ను ప్రారంభించాలని విద్యార్ధులు, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విద్యార్థులు కళాశాల గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మెస్ చార్జీల కొరకు ఇప్పటికే డీడీలను సమర్పించామని, అదేవిధంగా కళాశాల హాస్టల్లో మహిళా కేర్ టేకర్ లేరని తెలిపారు. వెంటనే రెగ్యులర్ మెస్‌ను కొనసాగించాలని, మహిళా కేర్‌టేకర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు బీఆర్ఎస్వీ నాయకులు సైతం మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment