ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
ఎర్రవల్లి: ఉజ్వల భవిష్యత్ కోసం ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని పదో పటాలం కమాండెంట్ సాంబయ్య అన్నారు. మంగళవారం ఎర్రవల్లి పదో పటాలం సమావేశ మందిరంలో పదో తరగతి విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్ రవీంద్ర ధీరచే ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏ రంగంలోకి వెళ్లాలన్న స్పష్టత ఉండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రేరణ ప్రోగ్రాం నిర్వాహకులు పల్లె నిర్మలరాజు, పరిపూర్ణ, వినోద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment