ఆంగ్లంలో పట్టు సాధించేందుకు పోటీలు దోహదం
గద్వాలటౌన్: విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించడానికి, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి పోటీలు దోహదం చేస్తాయని ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా అధ్యక్షుడు ఏజే మైఖల్, ప్రధాన కార్యదర్శి సుమలత అన్నారు. ఎల్టా ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాలభవన్‌లో జిల్లాస్థాయి ఒలింపియాడ్, ఆంగ్ల భాషపై ఉపన్యాస పోటీలు నిర్వహించగా.. సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒలింపియాడ్‌లో గట్టు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థి శిమమణి మొదటి, గద్వాల జీబీహెచ్‌ఎస్ విద్యార్థిని పూజిత ద్వితీయ బహుమతులు సాధించారు. ఆంగ్ల భాష ఉపన్యాస పోటీల్లో గద్వాల జీబీహెచ్‌ఎస్ విద్యార్థిని పూజిత మొదటి, రాయపురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని సానియాకు ద్వితీయ, అయిజ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి రవిచంద్రకు తృతీయ బహుమతులు గెలుపొందారు. కేజీబీవీల విభాగంలో మానవపాడు, వడ్డేపల్లి విద్యార్థులు గీతాంజలి, యాస్మిన్, పవిత్ర, రాణి బహుమతులు సాధించారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎల్టా నాయకులు వెంకట్రాములు, వేణుగోపాల్, విజయభాస్కర్, ఎల్లప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment