ఆశావర్కర్లను విస్మరిస్తే సమరమే
గద్వాలటౌన్: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడం కోసం క్షేత్రస్థాయిలో విస్తృత సేవలు అందిస్తున్న ఆశావర్కర్లను విస్మరిస్తే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి సునీత హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆశావర్కర్లు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లపై రోజురోజుకు పనిభారం పెరుగుతుందన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశావర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18వేలుగా నిర్ణయించి అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ నాయకురాలు పద్మమ్మ, మాధవి, కాంతమ్మ, చెన్నమ్మ, సుజాత, సరస్వతి, జయమ్మ, మమత, అనసూయ, సీఐటీయూ నాయకులు వీవీ నర్సింహ, ఉప్పేర్ నర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment