మద్దతు లభించేనా..! | - | Sakshi
Sakshi News home page

మద్దతు లభించేనా..!

Published Tue, Jan 28 2025 1:09 AM | Last Updated on Tue, Jan 28 2025 1:09 AM

మద్దత

మద్దతు లభించేనా..!

అలంపూర్‌: ఎట్టకేలకు కంది కొనుగోళు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్‌ కంటే అధిక మద్దతు ధరను కేంద్రాల్లో కల్పిస్తుండటంతో రైతులకు కాస్త ఊరట లభించనుంది. కేంద్రాలు వచ్చాయనే సంబరంతోపాటు మద్దతు ధర పొందడానికి ఉన్న నిబంధనలు రైతులను కొంత ఆందోళనలకు గురి చేస్తున్నాయి. నిబంధనలతోపాటు నాణ్యత ప్రమాణాల్లో ఖచ్చితత్వం సైతం రైతుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో పండించిన కంది పంటకు మద్దతు ధర లభిస్తుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

బహిరంగ మార్కెట్‌ కంటే అదనంగా..

జిల్లాలో ఐదు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం గౌరి నాగేశ్వర్‌ తెలిపారు. జిల్లాలో మొదటగా ఉండవెల్లి మండలం అలంపూర్‌ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ నెల 22వ తేదీన, అయిజలో 27వ తేదీన ప్రారంభించారు. వడ్డేపల్లి మండల కేంద్రం, ఇటిక్యాల మండలంలోని పుటాన్‌దొడ్డి, గద్వాల ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా, కంది పంటకు క్వింటాల్‌కు రూ.7550గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తేమ శాతం 12, ఇతర పదార్థాలు 2 శాతం, దెబ్బతిన్న గింజలు 3 శాతం, ఇతర పంట గింజలు 3 శాతం కంటే మించకుండా ఉండే విధంగా నాణ్యమైన గింజలు ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల మేరకు ఉన్న నాణ్యమైన గింజలకు ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేల నుంచి రూ. 6900 వరకు ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ కంటే మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు కేంద్రాలకు క్యూ కట్టనున్నారు.

జిల్లాలో

41,235 ఎకరాల్లో పంట సాగు

ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో కంది పంటను 41,235 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అందులో ఇటిక్యాలలో 7,156 ఎకరాలు, గద్వాలలో 5,616, వడ్డేపల్లిలో 5,258, అయిజలో 4,934, మానవపాడులో 4,808, ఉండవెల్లిలో 3672, ఎర్రవల్లిలో 2,240, మల్దకల్‌లో 2183, రాజోళిలో 1696, అలంపూర్‌లో 1294, గట్టులో 983, కేటీదొడ్డిలో 705, ధరూరులో 690 ఎకరాల్లో పంట సాగు చేశారు.

ప్రతి గింజను కొనుగోలు చేయాలి

ఐదు ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. ఎకరాకు 5 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. కానీ కేంద్రాల్లో నిబంధనల మేరకు 3.31 క్వింటాళ్లు మాత్రమే చెబుతున్నారు. మిగిలిన ధాన్యం ఎక్కడ విక్రయించాలో తెలియట్లేదు. నిబంధనల పేరు చెప్పి సరిగ్గా కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తోంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తేనే మేలు జరుగుతోంది.

– మద్దిలేటి, కంది రైతు, ఉండవెల్లి

నాణ్యమైన పంటకు

మద్దతు ధర

జిల్లాలో రెండో కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. నాణ్యమైన కందికి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కల్పిస్తాం. ప్రస్తుతం ఎకరాకు 3.31 క్వింటాళ్లు కొనుగోలు చేస్తాం. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు 5 క్వింటాళ్లు కొనుగోలు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశాం. వారి ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తాం.

– గౌరి నాగేష్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం

జిల్లాలో కంది కొనుగోళ్లు షురూ..

రెండు కేంద్రాల ప్రారంభం.. మరో మూడింటికి సన్నాహాలు

లక్ష క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యం

నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలపై రైతుల్లో ఆందోళన

ఆన్‌లైన్‌లో నమోదు కాకపోతే తప్పని తిప్పలు

No comments yet. Be the first to comment!
Add a comment
మద్దతు లభించేనా..! 1
1/3

మద్దతు లభించేనా..!

మద్దతు లభించేనా..! 2
2/3

మద్దతు లభించేనా..!

మద్దతు లభించేనా..! 3
3/3

మద్దతు లభించేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement