బీసీ కుల గణన చేపట్టాలి
పూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్
అమలాపురం టౌన్: రాష్ట్రంలో తక్షణమే కుల గణన చేపట్టాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అమలాపురంలోని మున్సిపల్ చిల్డ్రన్ పార్కు వద్ద గల పూలే విగ్రహానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు గురువారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పర్యవేక్షణలో నిర్వహించిన రాష్ట్ర బీసీ కుల గణన సర్వే నివేదికను నేటి కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా బీసీలకు రాజ్యాధికారం కోసం ప్రత్యేక చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. పూలే ఆశయ సాధనకు మేమంతా కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో 139 బీసీ కులాల వృత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని, 50 శాతం రిజర్వేషన్ బెంచ్ మార్కును ఎత్తివేయాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ బీసీ నాయకులు కుడుపూడి త్రినాథ్, చిట్టూరి పెదబాబు, ముంగర ప్రసాద్, అంబేడ్కర్ సేవా సమితి ప్రతినిధి చీకురుమిల్లి కిరణ్‌కుమార్ తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment