కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులను మంగళవారం నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. యువజన విభాగానికి కొప్పన శివనాథ్ (పిఠాపురం), ఎస్సీ సెల్‌కు శెట్టిబత్తుల కుమార్‌రాజా (ప్రత్తిపాడు), పంచాయతీరాజ్ వింగ్‌కు మోరంపూడి శ్రీరంగనాయకులు (పెద్దాపురం), మున్సిపల్ వింగ్‌కు కనిగిరి వెంకట రమణ (తుని), ఆర్‌టీఐ వింగ్‌కు జీఎస్‌ఎన్ స్వామి (ప్రత్తిపాడు), వీవర్స్ వింగ్‌కు తెడ్లపూడి చిన్నారావు పిఠాపురం), వైఎస్సార్ టీయూసీకి చెక్కల చక్రవర్తి (కాకినాడ సిటీ), కల్చరల్ వింగ్‌కు పెద్దాడ రాజబాబు (జగ్గంపేట), ఐటీ వింగ్‌కు వెరనాటి ఇమ్మానుయేల్ రాజు (పెద్దాపురం), ఇంటెలెక్చువల్ ఫోరానికి అవసరాల పార్థసారథి(జగ్గంపేట)లను జిల్లా అధ్యక్షులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment