రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గోకవరం: గోకవరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంటపల్లికి చెందిన సాత్నబోయిన దుర్గాప్రసాద్ (23) మృతి చెందాడు. ఆ వివరాల ప్రకారం.. గోకవరంలో సినిమా చూసేందుకు టిక్కెట్ల కోసం దుర్గాప్రసాద్ బైక్‌పై వచ్చాడు. టిక్కెట్లు తీసుకున్న అనంతరం తన స్నేహితుడిని సినిమాకు తీసుకు వచ్చేందుకు వీరలంకపల్లి వెళ్తుండగా గోకవరంలో పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి ఉన్నారు. చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment