సముద్రంలో పడి వ్యక్తి మృతి
కొత్తపల్లి: వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మృతి చెందినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సూరాడపేటకు చెందిన సూరాడ అప్పారావు (19) ఉప్పాడకు చెందిన సూరాడ యల్లాజీ బోటుపై శుక్రవారం తెల్లవారు జామున వేటకు వెళ్లాడు. సముద్రంలో వేటాడుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయాడు. అతని కోసం తోటి మత్స్యకారులు గాలించగా తాతారావు బోటు వలకు చిక్కాడు. అప్పారావు మృతదేహాన్ని శనివారం తెల్లవారు జామున అమీనాబాద్ తీరానికి తీసుకువచ్చారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment