ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించండి
కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు కోరారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. అదే రోజు నుంచి 10వ తేదీ వరకూ నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారని అన్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెంకటరావు వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కాగా, ఏఆర్‌వోలుగా ఆయా జిల్లాల డీఆర్వో వ్యవహరిస్తారన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. మొత్తం 440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఏలూరు కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్.వెంకటేశ్వరరావు, కె.కృష్ణమోహన్, ఎస్.అప్పారావు, పి.వీరబాబు, బి.జయప్రకాష్, జి.సాయిబాబా, ఎ.వీరవెంకట సత్యనారాయణ, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment