చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్
అమలాపురం టౌన్: అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారని ఆ అకాడమీ ప్రిన్సిపాల్, జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకటసురేష్ తెలిపారు. పెద్దాపురం జవహర్ నవోదయ స్కూల్‌లో చదువుతున్న కొండా శివేంద్ర 1,406 రేటింగ్ పాయింట్లు, అమలాపురం విద్యానిధి స్కూల్‌లో చదువుతున్న పితాని రాఘవేంద్ర 1,443, సాధనాల శ్రీసంతోష్ 1,494 రేటింగ్ పాయింట్లు సాధించారని అన్నారు. ఇంత వరకూ విక్టరీ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు రేటింగ్ సాధించారని వివరించారు. అంతర్జాతీయంగా రేటింగ్ సాధించిన విద్యార్థులను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, అమలాపురం విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్న నాయుడు అభినందించారు.
ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: మాధవపట్నంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి బస్టాండ్ వద్ద ఉన్న ఆలయంలో రేకుల షెడ్ రాక్‌కు పంచెతో ఉరి వేసుకున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించి సామర్లకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరి వేసుకున్న వ్యక్తి మోకాళ్లు నేలకు తాకి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లి సంకర రత్నవతి సంఘటనా ప్రదేశానికి చేరుకుంది. తన కుమారుడు రాంబాబు (48) కొంత కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతుండడతో మాధవపట్నంలోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నామని పోలీసులకు తెలిపింది. రోజూ కొమరిగిరి వెళ్లి రావడం ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామంలో ఉన్న బస్ షెల్టర్‌లో ఉంటూ రోజూ డాక్టర్‌తో ఇంజెక్షన్ చేయిస్తున్నట్లు చెప్పింది. శుక్రవారం సాయంత్రం తన కుమారుడిని అక్కడే ఉండమని చెప్పి కొమరిగిరిలో శనివారం పింఛను తీసుకోవడానికి వెళ్లినట్లు సత్యవతి చెప్పింది. ఇంతలో ఇలా జరిగినట్లు వివరించింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేశారు.
కేసు నిర్వీర్యానికి కుట్ర
కరప: వాకాడ పాఠశాలలో కొందరి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వీఎస్ రామారావు కేసును నిర్వీర్యం చేస్తున్నట్టు మానవ హక్కుల వేదిక శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. నిజ నిర్ధారణ కోసం వాకాడ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పోలీసులను కలసినట్టు ఆ సభ్యులు తెలిపారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు కానీ ఏమీ చెప్పకపోవడం, కరప పోలీస్ స్టేషన్‌లో దీనికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. బాధితులు, తల్లిదండ్రులు నోరు తెరిచి చెప్పుకోకుండా కట్టడి చేసినట్టు ఆరోపించారు. నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇక్బాల్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment