19.265 కేజీల గంజాయితో నిందితుడి అరెస్టు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై రాచపల్లి అడ్డరోడ్డు జంక్షన్ వద్ద 19.265 కేజీల గంజాయితో ఒకరిని స్థానిక ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎకై ్సజ్ సీఐ పి శివప్రసాద్ కథనం మేరకు అల్లూరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన తరుం వెంకటేశ్వరరావు గంజాయి వ్యాపారం చేసేవాడు. అయితే కొంతకాలంగా శంఖవరం మండలం సిద్దువారిపాలెం గ్రామంలో పంట పొలాలకు కాపలాదారునిగా పనిచేస్తున్నాడు. 19.265 కేజీల గంజాయిని ఆటోలో ఏజెన్సీ ప్రాంతం నుంచి రప్పించుకుని, రవాణా చేసేందుకు రాచపల్లి అడ్డురోడ్డు వద్ద వేచిఉన్నాడు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ సీఐ పి శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని, తరుం వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి కాటం భాను రిమాండ్ విధించారు.
దాడి చేసిన యువకులపై కేసు నమోదు
అమలాపురం టౌన్: దళిత యువకుడైన ఏసీ మెకానిక్ గంటి కిరణ్‌పై దాడి చేసిన ముగ్గురు ఇంటర్మీడియెట్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. గాయపడ్డ ఏసీ మెకానిక్ కిరణ్‌ను పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు జిల్లా దళిత ఐక్య వేదిక నాయకులు, పలు దళిత సంఘాల ప్రతినిధులు దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేసిన క్రమంలో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. దాడి చేసిన ముగ్గురు యువకులు మైనర్లు కావడంతో వారిపై కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులుతెలిపారు.
చికిత్స పొందుతూ బాలుడి మృతి
అల్లవరం:మండలంలోని గోడి బాడవ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు సిర్రా సందీప్ అమలాపురంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సందీప్‌కు ఆరోగ్యం బాగోకపోవడంతో తల్లిదండ్రులు దుర్గాప్రసాదు, శిరీష మోటారు సైకిల్‌పై తీసుకుని ఆస్పత్రికి వెళ్తుండగా గోడిలంక శ్మశాన వాటిక సమీపంలో కుక్క వేగంగా వస్తూ మోటారు సైకిల్‌కి అడ్డు పడింది. దీంతో మోటారు సైకిల్ అదుపుతప్పి ముగ్గురూ పడిపోయాడు. ఈ ఘటనలో సందీప్‌కు తీవ్ర గాయాలై ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం కాగా, తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి. సందీప్‌ను పేరూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌లో కిమ్స్‌కి తరలించి సందీప్‌కు చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అల్లవరం ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు. సందీప్ మృతి పట్ల ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం మండలం ఏ.వేమవరం గ్రామానికి చెందిన లింగోలు వీర వెంకట సత్యనారాయణ (సతీష్) గోడితిప్ప వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్లవరం పోలీసులు తెలిపారు. అతను చెప్పుల షాపులో సెల్స్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సతీష్ తండ్రి చిన్నప్పుడే మృతి చెందారని, ఆరు నెలల కిత్రం అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో ఒంటరి తనం భరించలేక సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడిలంక నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీని పి.గన్నవరం తహసీల్దార్ పి.శ్రీపల్లవి మంగళవారం సీజ్ చేశారు. లంక నుంచి మట్టిలోడుతో వస్తున్న లారీని ఏటిగట్టుపై ఆమె పట్టుకున్నారు. సీజ్ చేసిన లారీని తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ ర్యాంపులకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment