కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు
సుభాష్‌నగర్: నగరంలోని కలెక్టరేట్‌లో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు రమేశ్, నర్సయ్య, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment