‘నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం’
మాచారెడ్డి : వినియోగదారులకు నాణ్యమైన వి ద్యుత్ అందిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం చుక్కాపూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో కామారెడ్డి రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని మా చారెడ్డి, వెల్పుగొండ, సదాశివనగర్, రామారెడ్డి మండలాల వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి 10 ఫిర్యాదులు అందాయని, ఇందులో మూడింటిని వెంటనే పరిష్కరించా మని పేర్కొన్నారు. మిగతా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ మోటార్ల వద్ద ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు సొంతంగా మరమ్మతులు చేయకుండా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఈ వేదికకు మాచారెడ్డి, వెల్పుగొండ వినియోగదారులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రవణ్ కుమార్, డీఈ కల్యాణ చక్రవర్తి, మాచారెడ్డి ఏఈ తిరుపతిరెడ్డి, సీజీఆర్‌ఎఫ్ సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment