![రాష్ట్ర స్థాయి ట్రయథ్లాన్ పోటీలకు ఎంపిక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10kmr251-250033_mr-1739217275-0.jpg.webp?itok=3n9nDKd0)
రాష్ట్ర స్థాయి ట్రయథ్లాన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలలో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఎంపిక చే శారు. ఎంపిక పోటీలలో 300 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఇందులో ప్రతిభ చూపిన 25 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా యు వజన, క్రీడల అధికారి జగన్నాథం తెలిపారు. రన్, త్రో, జంప్ విభాగాలలో ప్రతిభ చూపినవారికి పతకాలు, ప్రశంస పత్రాలు అందించామన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18, 19 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రతినిధులు దత్తాద్రి, అతీకుల్లా, శ్రీనివాస్, శివాగౌడ్, నరేష్‌రెడ్డి, అరుణ, సరిత, సంజీవ్ పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు
ఎం.హర్షవర్ధన్, జి.జీవన్, బి.సుమలత, ఎస్.భవాని, కె.గంగోత్రి, ఎం.రాము, బి.సంజు, సీహెచ్.లక్ష్మణ్, రిమ్‌షాబేగం, హెచ్.ప్రియాంక, ఎన్.నితిన్, బి.విజయ్‌సింగ్, సీహెచ్.ప్రశాంత్, కె.వంశీకృష్ణ, జి.కార్తీక్, ఎస్.రాహుల్, కె.మౌనిక, ఆర్.సంధ్య, టి.శ్రావ్య, ఎన్.సంధ్య, ఎం.రోహిత్, బి.ఈశ్వర్, డి.అనిల్‌కుమార్, ఎస్.దివ్య, ఎం.ఈశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment