![ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10kmr276-250028_mr-1739217276-0.jpg.webp?itok=9rfglls0)
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు దఫాల్లో సర్పంచ్, వార్డు స భ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున అందుకు తగిన విధంగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు డివిజన్ స్థాయిలో బుధవారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 14, 15 తేదీ ల్లో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకానికి ర్యాండమైజేషన్ చేపట్టి విధులు కే టాయించాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దకొడప్‌గల్ మండలం బాబుల్‌గావ్‌లో పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయిలో సమావేశాన్ని మంగళవా రం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బుధవారంలోగా తెలియజేయాలని సూచించారు. ఈనెల 14 న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీపీవో శ్రీనివాస్‌రావు, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్‌డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment