బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌

Published Tue, Feb 11 2025 1:30 AM | Last Updated on Tue, Feb 11 2025 1:30 AM

బస్వా

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌

భిక్కనూరు : బస్వాపూర్‌ గ్రామ శివారులోని హోటల్‌లో త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి కాసేపు ఆగారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఆయన హోటల్‌లో ఆగి టీ తాగారు. ఆయన వెంట ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఉన్నారు.

చిరుత సంచారం..

భయాందోళనలో ప్రజలు

లింగంపేట: కంచ్‌మల్‌, సీతాయిపల్లి గ్రామాల మధ్య చిరుతపులి సంచరిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం రాత్రి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు పక్కన చిరుతను గమనించారు. దానిని వెంటనే వారి సెల్‌ఫోన్‌లలో బందించారు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి, వెంటనే చిరుతను బందించాలని కోరుతున్నారు.

పోచారం వద్ద

చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

నాగిరెడ్డిపేట : అనారోగ్యానికి గురైన కోళ్ల రవాణాను అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దులోని పోచారం వద్ద చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. నాగిరెడ్డిపేట పోలీసులు, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్‌పోస్ట్‌ను నిర్వహించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోకి ప్రవేశించే వాహనాలతోపాటు జిల్లానుదాటి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి రవికుమార్‌ ఉన్నారు.

కించపరిచిన వ్యక్తిని

కఠినంగా శిక్షించాలి

తాడ్వాయి: దళితుడిని కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య డిమాండ్‌ చేశా రు. ఆయన సోమవారం బ్రహ్మాజీవాడిని సందర్శించి, ఇటీవల గ్రామంలో జరిగిన ఘ టనపై ఆరాతీశారు. డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ రహీమొద్దీన్‌ సమక్షంలో జరిగిన ఘటన గురించి బాధితుడు కూరెళ్లి రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు అవుతున్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధుఐ్యలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, గౌరవ అధ్యక్షుడు మల్లన్న, తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో

విధులు నిర్వహించాలి

కామారెడ్డి క్రైం: క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కొత్త కానిస్టేబుళ్లకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలన్నారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లు పోలీస్‌ స్టేషన్‌లో విధులు ఎలా నిర్వహించాలి, ప్రజలతో ఎలా మెలగాలి, బందోబస్తుకు వెళ్లినప్పుడు ఎలా డ్యూటీ చేయాలి, ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై సీనియర్‌ అధికారులు అవగాహన కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌ 
1
1/3

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌ 
2
2/3

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌ 
3
3/3

బస్వాపూర్‌లో ఆగిన త్రిపుర గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement