తెయూలో ఆరోగ్య విద్యను ప్రోత్సహిస్తాం
భిక్కనూరు/తెయూ(డిచ్‌పల్లి): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు కట్టుబడి విశ్వవిద్యాలయంలో ఆరోగ్య విద్య, కౌన్సెలింగ్ సేవలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తామ ని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ సౌత్ క్యాంపస్‌లోని సోషల్ వర్క్ విభాగం, సూర్య ఆరోగ్య సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా సోమవారం ఒప్పంద పత్రాలపై తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ చేకూరి ఉదయ సూర్యభగవాన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆరోగ్య విద్య, నిర్మాణాత్మక సంస్కరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ, శారీరక శ్రేయస్సును పెంపొందించడమే ఈ ఎంవోయూ లక్ష్యం కావాలన్నారు. సంస్థ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్ మాట్లాడుతూ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజారోగ్యం, శ్రేయస్సు మెరుగుపర్చడానికి తమ సంస్థ కట్టుబడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సంస్థ సభ్యులు రవితేజ, ఆనంద్, రాజేశ్వరి, అంజయ్య పాల్గొన్నారు.
వీసీ యాదగిరి రావు
సూర్య ఆరోగ్య సంస్థతో ఎంవోయూ
Comments
Please login to add a commentAdd a comment