![ఆఖరిర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knt408-604887_mr-1739217273-0.jpg.webp?itok=ODZu4AlX)
ఆఖరిరోజు అట్టహాసంగా..
● ముగిసిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్
ఎమ్మెల్సీ నామినేషన్లు
● ఒకేరోజు నామినేషన్ వేసిన
59 మంది అభ్యర్థులు
● రెండుస్థానాలకు కలిపి
మొత్తం 117 దాఖలు
● జనసంద్రమైన కరీంనగర్ వీధులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోమవారం నామినేషన్లకు ఆఖరురోజు కావడంతో భారీగా అభ్యర్థులు పోటెత్తారు. అనుచరులు, కార్యకర్తలు వెంటరాగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు 59 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 51 గ్రాడ్యుయేట్స్ కోసం రాగా.. మిగిలిన 8 టీచర్స్ స్థానానికి వచ్చినట్లు వివరించారు. మూడో తేదీన మొదలై నామినేషన్లలో ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్‌కు 100, టీచర్స్ ఎమ్మెల్సీకి 17 నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరీంనగర్ నగర వీధులన్నీ ర్యాలీలతో నిండిపోయాయి. కాంగ్రెస్ తరఫున పలువురు మంత్రులు హాజరు కాగా.. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ర్యాలీల కోసం భారీగా జనసమీకరణ చేయడంతో నగర వీధులన్నీ జనసంద్రంగా మారాయి. కళాకారుల ఆటపాటలు, డప్పువాయిద్యాలతో హోరెత్తిపోయాయి.
● కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి రెండోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, విప్‌లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణరావు, మక్కాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
● బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ట్రస్మా శేఖర్‌రావులు భారీగా అనుచరులు తరలిరాగా స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. రవీందర్‌సింగ్ కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి నామినేషన్ వేయడం గమనార్హం. వీరిద్దరూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే అయినా.. ఈసారి స్వతంత్రులుగా బరిలోకి దిగడం విశేషం.
● ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. ఆయన వెంట హర్షవర్దన్‌రెడ్డి, సత్యనారాయణ, షాబీర్, తిరుపతి, గజేందర్, రవి ఉన్నారు.
● టీఎస్‌యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గ టీపీటీఎఫ్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ నామినేషన్ వేశారు. నల్గొండ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బరిలో మిలియనీర్లే..
చిన్నమైల్ అంజిరెడ్డి
వ్యక్తిగత ఆస్తులు: రూ.120,40,41,274
భార్య ఆస్తులు : రూ.54,79,63023
మొత్తం రూ.175 కోట్లపై చిలుకు
బంగారం వ్యక్తిగతం : 250 గ్రాములు
(విలువ రూ.19.32 లక్షలు)
భార్య పేరిట 1,850 గ్రాములు
(విలువ రూ.1.43 కోట్లు)
అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
వ్యక్తిగత ఆస్తులు : రూ.30,00,59,840
భార్య పేరిట: రూ.13,38,36,263
(ఆయన భార్యకు క్రిస్టా కారు, అరకిలో బంగారం)
ఉమ్మడి ఆస్తులు రూ. 2 కోట్లు
మొత్తం రూ.45.50 కోట్లు
మల్క కొమురయ్య
వ్యక్తిగత ఆస్తులు: రూ.32,08,62,420,
ఆయన భార్యకు: రూ.29,55,03,158
మొత్తం కలిపి: రూ.61,63,65,578
భార్య వద్ద 4,457 గ్రాముల బంగారం
![ఆఖరిరోజు అట్టహాసంగా..1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10knt401-604887_mr-1739217273-1.jpg)
ఆఖరిరోజు అట్టహాసంగా..
![ఆఖరిరోజు అట్టహాసంగా..2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10knt404-604887_mr-1739217273-2.jpg)
ఆఖరిరోజు అట్టహాసంగా..
Comments
Please login to add a commentAdd a comment