తల్లడిల్లిన తల్లి గుండె..!
● బిడ్డ మృతదేహాన్ని పట్టుకొని విలపించిన వానరం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లిప్రేమ ఏ జీవిలోనైనా ఉన్నతంగానే ఉంటుంది. మరణించిందని తెలియక తన బిడ్డ కళేబరం వద్ద కూర్చొని ఓ వానరం దానిని లేపే ప్రయత్నం చేసింది. ఎంత లేపినా తన బిడ్డ లేవకపోవడంతో చివరికి దానిని ఎత్తుకొని చెరువుగట్టుకు వెళ్లిన ఘటన బుధవారం నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. తన బిడ్డను ఎత్తుకొని వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్న వానరాన్ని చూసిన స్థానికులు ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment