● మెడలో నుంచి బంగారు
పుస్తెలతాడు అపహరణ
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో దుండగులు ఓ మహిళను హత మార్చి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కంచర్ల గ్రామనికి చెందిన బాలెముల (చీకోటి) సుగుణ(55) తన భర్త సిద్ధరాములుతో కలిసి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లింది. కంచర్ల – ఇస్సానగర్ వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న వీరి భూమిలోని వరి కొయ్యలను సుగుణ ఏరి వేస్తుండగా, ఆమె భర్త సిద్ధరాములు కొద్ది దూరంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. దుండగులు సుగుణపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్సీ నాగేశ్వర్రావు, భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై సాయికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలికి భర్తతోపాటు కుమారుడు రాజు, కుమార్తెలు శారద, శ్యామలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment