మెరుగైన వైద్య సేవలందించాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన జీజీహెచ్‌ను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఫరీదాతో మాట్లాడారు. ఆస్పత్రిలోని సమస్యలను తెలుసుకున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్
జిల్లా ఆస్పత్రి తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment