రేపు జాబ్ మేళా
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని స్టాఫింగ్ టైటాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎల్ గ్రూప్ కంపనీలలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపువారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్‌లతో కలెక్టరేట్‌కు రావాలని, ఇతర వివరాలకు 76719 74009, 63039 32430, 77308 20444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మున్నూరుకాపు సంఘం ‘సీనియర్’
జిల్లా అధ్యక్షుడిగా గంగయ్య
కామారెడ్డి రూరల్: జిల్లా మున్నూరుకా పు సంఘం సీనియ ర్ సిటిజన్స్ జిల్లా అ ధ్యక్షుడిగా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అన్మాల గంగ య్య నియమితులయ్యారు. ఈ విషయాన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, కామారెడ్డి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి చదల సత్యనారాయణ తెలిపారు. నీలం నర్సింలును జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించామని పేర్కొన్నారు.
‘జిల్లాలోనే
పెద్ద గ్రంథాలయం’
కామారెడ్డి అర్బన్: రిఫరెన్స్ పుస్తకాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలోనే పెద్ద గ్రంథాలయంగా కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రంథాలయం నిలుస్తుందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య పేర్కొన్నారు. కళాశాలలో బుధవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల గ్రంథపాలకుడు లక్ష్మణాచారి, అధ్యాపకులు ఆకుల సుధాకర్, విశ్వప్రసాద్, జి.శ్రీనివాస్‌రావు, దినకర్, అంకం జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తెరుచుకున్న డాక్యుమెంట్
రైటర్ల దుకాణాలు
సుభాష్‌నగర్: నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రే షన్ కార్యాలయ దస్తావేజు లేఖర్ల దుకాణాలు బుధవారం తెరుచుకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఇబ్బంది పెడుతున్నారంటూ 9 రోజులుగా దుకాణాలు మూసి ఉంచారు. దీంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. అయితే సబ్ రిజిస్ట్రార్ నాలుగు రోజులు సెలవులో వెళ్లారు. ఇన్‌చార్జిగా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. దస్తావేజు లేఖర్లు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేయించారు. బుధవా రం ఒక్కరోజే 40 వరకు సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్‌గేజ్, తదితర డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. చాలా రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లతో సందడిగా మారింది.
జాతీయస్థాయి పోటీలకు
దేవునిపల్లి విద్యార్థులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రోల్ పే కాంపిటీషన్–2024(పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ అంశం)లో పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ రమేష్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నా రు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం గంగాకిషన్, గైడ్ టీచర్ భవాని, ఉపాధ్యాయ బృందాన్ని డీఈవో రాజు అభినందించారు. విద్యార్థులతో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణు శర్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment