ట్రెజరీలో అక్రమ వసూళ్లు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ట్రెజరీ కార్యాల యంలో ఉద్యోగులు పనికో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయు ల పెన్షన్ ప్రపోజల్స్ పంపడానికి, కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు ట్రెజరీ ఐడీ కేటాయించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని టీపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అనిల్‌కుమార్, సీహెచ్ లింగం, జిల్లా ఉపాధ్యక్షురాలు నళినిదేవి, ఫెడరేషన్ సలహాదారు పి.అంజయ్యలు ట్రెజరీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లును కలిశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతోందని పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో అక్రమ వసూళ్లను నిలువరించకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
పెన్షన్ ప్రపోజల్స్‌కు ధర కడుతున్న
అధికారులు
చర్యలు తీసుకోవాలని
టీపీటీఎఫ్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment