సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అధునాతన సౌకర్యాలతో కూడిన అదనపు భవనం మండలాల్లో పక్కా భవనాలు నిర్మించే విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభను బుధవారం కామారెడ్డిలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా షబ్బీర్‌అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. షబ్బీర్‌అలీ ఫౌండేషన్, ఇతర దాతల సహకారంతో గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తామన్నారు. గ్రంథాలయాలను వినియోగించుకుని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని నిరుద్యోగులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి సూచించారు. కోరిన వెంటనే అవసరమైన రిఫరెన్స్ పుస్తకాలు అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు సాధించిన పలువురిని సన్మానించారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, డీఎస్పీ నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉర్దొండ వనిత, కౌన్సిలర్ ఎం.ప్రసూన, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
Comments
Please login to add a commentAdd a comment