అనుమతులు లభించక..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రాజంపేట మండల కేంద్రం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి నోచుకోవ డం లేదు. ప్రధానంగా రాజంపేట మండ లం అర్గొండ నుంచి కొండాపూర్ గ్రామం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో రోడ్డు అ ధ్వానంగా తయారయ్యింది. పెద్దపెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ఏదో ఒక వాహనం అదుపుతప్పి పడిపోతోంది. రాజంపేట మండలంలోని అర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, బస్వన్నపల్లి, గుండారం గ్రామాల నుంచే కాకుండా అనేక తండాలు ఈ రోడ్డుపై ఉంటాయి. అలాగే మెదక్ జిల్లాలోని వాడి, బూరుగుపల్లి, తదితర గ్రామాల నుంచి నిత్యం కా మారెడ్డి పట్టణానికి వేలాది మంది రాకపోకలు సాగి స్తుంటారు. కూరగాయలు పండించిన రైతులు, అ లాగే నిర్మాణరంగంలో పనిచేసే కూలీలు చాలా మంది నిత్యం బైక్‌లు, ఆటోలలో వచ్చిపోతుంటారు. అలాగే బస్సు సర్వీసులూ నడుస్తుంటాయి.
భారీ గుంతలు..
అర్గొండ –కొండాపూర్ గ్రామాల మధ్య రోడ్డు రెండు వరుసలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఉన్న రోడ్డు కూడా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కొన్నిచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనం కానీ, ఆటోలు కానీ కొంత వేగంగా వెళ్తే బోల్తా పడే ప్రమాదం ఉంది. అలాగే ఎదురుగా బస్సులు, లారీలు వచ్చినపుడు రోడ్డు దింపితే పడిపోయి గాయాల పాలవుతున్నారు. కొండాపూర్ నుంచి మెదక్ జిల్లా సరిహద్దు వరకు కూడా రెండు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేసినా.. ఆ రోడ్డుపైనా అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. గుంతలను పూడ్చాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
మలుపుల్లో
పొంచి ఉన్న
ప్రమాదం
అర్గొండ–కొండాపూర్ గ్రామాల మధ్య సుమారు 5 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోని ఘాట్ సెక్షన్‌లో ఉన్న మూలమలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. మూల మలుపుల వద్ద గో స్లో అన్న బోర్డులు తప్ప తగిన రక్షణ ఏర్పాట్లు చేయలేదు. ఒక్కోసారి వాహనాలు రోడ్డు దిగిపోయి పడిపోతున్నాయి. గతంలో ఓ ఆటో బోల్తాపడిన ఘటనలో పలువురు మృతిచెందారు. ఈ మార్గంలోని మూలమలుపుల వద్ద పడిపోయి ద్విచక్ర వాహనదారులు పలువురు గాయాల పాలయ్యారు. లోడ్‌తో ఉండే ట్రాక్టర్లు, లారీలు మూల మలుపుల వద్ద ఘాట్ సెక్షన్ ఎక్కలేక ప్రమాదాలకు గురవుతున్నాయి.
డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు గతంలో నే నిధులు మంజూరయ్యాయి. అటవీ సరిహ ద్దు వరకు రెండు వరుసలుగా రోడ్డును డెవలప్ చేశారు. కానీ అటవీశాఖ అనుమతులు దొరక్కపోవడంతో 5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. రహదారి విస్తరణ విషయమై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నానన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరు కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గుంతలు పూడ్చాలి
అంతర్ జిల్లా రహదారిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బంది పడుతున్నాం. ఈ దారి లో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గుంతలను పూడిస్తే సమస్య కొంత వరకు తగ్గుతుంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి.
– సయ్యద్ మీర్, వాహనదారుడు, అర్గొండ
పనులు పూర్తి చేయాలి
కామారెడ్డి నుంచి మెదక్ వ రకు డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులు మధ్యలో నిలిచిపోయాయి. ముఖ్యంగా అడవి లో సింగిల్ రోడ్డు ఉంది. మూలమలుపులు, గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేయాలి.
– రాజేందర్, వాహనదారుడు, కొండాపూర్
Comments
Please login to add a commentAdd a comment